
మంచిర్యాల: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను అమ్ముకొని మద్దతు ధర పొందాలని కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సూచించారు. మంగళవారం (ఏప్రిల్ 15) చెన్నూర్ మండలంలోని ముత్తరావు పల్లె గ్రామంలో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వివేక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన ముచ్చటించారు. రైతుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Also Read :- ఎవరేం మాట్లాడినా నో యూజ్.. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా బలపడుతున్నారని ఈ సందర్భంగా రైతులు ఎమ్మేలకు వివరించారు. రైతులు అందరికీ 500 బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతోనే.. మూడు సార్లు సీసీఐ పత్తి కొనుగోళ్ళు నిలిపివేసిన మళ్ళీ ప్రారంభించి రైతుల కష్టాలను దూరం చేశారని కృతజ్ఞతలు తెలిపారు.