ఇన్ని రోజులు ఏం చేశారని.. ఇప్పుడు మా గ్రామానికి వస్తున్నారు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను దళితులు అడ్డుకున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం తుజల్ పూర్ గ్రామంలోకి ఎమ్మెల్యే కారు రానివ్వకుండా తీవ్ర స్థాయిలో నిరసనకు దిగారు. ఎన్నికల సమయం రాగానే రాజకీయ నాయకులు గ్రామాల్లోకి వస్తున్నారని.. ఇన్ని రోజులు తమ గ్రామానికి ఎందుకు రాలేరని ప్రశ్నించారు. గ్రామ అభివృద్ధికి నోచుకోని వారేందుకు ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. 

ALSO READ : ఏం అభివృద్ధి చేశావో చూపించు.. రేగా కాంతారావుకు నిరసన సెగ

ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు అందోళనకారులను అడ్డుకున్నారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. అర్హులైన వారికి దళితబంధు ఇవ్వడం లేదని దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక బీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

అర్హలందరికీ సమానంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను ఎవ్వరిని గ్రామంలోకి రానివ్వమని డిమాండ్ చేశారు.