కామారెడ్డి, వెలుగు: దేశంలో కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మిదేవి గార్డెన్లో విద్యుత్ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. స్టేట్ఏర్పడకముందు కరెంట్ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. కలెక్టర్ జితేశ్వి పాటిల్, ఎన్పీడీసీఎల్ డీఈ సాలియా నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి పాల్గొన్నారు.
ఆర్మూర్: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని సంస్కరించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ లో సోమవారం నిర్వహించిన విద్యుత్‌రంగ విజయోత్సవాలకు హాజరై మాట్లాడారు. నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరాలో తెలంగాణ నెంబర్‌వన్ పొజిషన్లో ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గోవింద్, జడ్పీటీసీ మెట్టు సంతోష్, ఎంపీపీలు మాస్త ప్రభాకర్, పస్క నర్సయ్య పాల్గొన్నారు.
పిట్లం: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాకే కరెంట్ కష్టాలు తొలిగాయని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం బిచ్కుందలో విద్యుత్ విజయోత్సవం నిర్వహించారు. డీఈఈ రామేశ్వరరావు, ఎంపీపీ అశోక్‌పటేల్, జడ్పీ సీఈవో సాయాగౌడ్ పాల్గొన్నారు.
బోధన్: కరెంట్ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉందని ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు. సోమవారం పట్టణ శివారులోనే ఏఆర్‌గార్డెన్‌లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ప్రగతిలో సాధించిన విజయాలు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్ వీఆర్దేశాయ్ పాల్గొన్నారు.