ఎంజేపీ స్కూల్​లో నీటి సమస్య తీర్చాలి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ఎంజేపీ స్కూల్​లో నీటి సమస్య తీర్చాలి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మొగుళ్లపల్లి, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి ఎంజేపీ స్కూల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న వాటర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత ఆఫీసర్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశించారు. మంగళవారం మహాత్మా జ్యోతీరావు పూలే స్కూల్ ను ఎమ్మెల్యే ఆకస్మికంగా విజిట్ చేశారు.

సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్​లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అంతకుముందు ఎంపీడీవో ఆఫీసులో పలు గ్రామాలకు చెందిన 36 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు.