మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు: యువత తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణిస్తూ, స్వయంకృషితో ఎదగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండలంలోని అంకుషా పూర్ కి చెందిన యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నూనేటి రమేశ్ఏర్పాటు చేసిన హోల్సేల్ కిరాణా షాప్ను ఎమ్మెల్యే నాయకులతో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ యువత వ్యసనాలకు అలవాటు పడకుండా, సన్మార్గంలో నచ్చిన పని చేసుకుంటూ, ఆర్థికంగా ఎదుగుతూ తల్లిదండ్రులకు, కుటుంబానికి భరోసాగా నిలవాలని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ప్రతిపక్షాలు ఓర్వలేక ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కోటగిరి సతీశ్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల ప్రెసిడెంట్ సంగి రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి వైనాల రవీందర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్, ఆర్ఎంపీల సంఘం జిల్లా ప్రెసిడెంట్ కత్తి సంపత్ గౌడ్, చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగంపల్లి కిరణ్ రావు, పెరుమాండ్ల క్రాంతి గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు అల్లం ఓదేలు తదితరులు పాల్గొన్నారు.