విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి :  ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి :  ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

రేగొండ, వెలుగు: బీసీ కులగణన, ఎస్సీ రిజర్వేషన్లపై విపక్షాలు చేస్తున్న పసలేని విమర్శలను తిప్పికొట్టాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.  ఆదివారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బీసీ కులగణన విజయవంతం కావడంతో కాంగ్రెస్​ నేతలు ర్యాలీ చేపట్టారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే  సత్యనారాయణ రావు మాట్లాడారు.  ఎస్సీల్లో 36 కులాలు ఉండి వర్గీకరణ జరగక ఏళ్ల తరబడిగా వెనకబడి పోయాయన్నారు.

కాంగ్రెస్​ సర్కారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే బీసీ కులగుణన విజయవంతం చేయడంతో పాటు ఎస్సీవర్గీకరణ చేస్తామన్న మాట నిలుపుకుందన్నారు.  పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ నాయకులు పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. ఏడాది కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న బీఆర్​ఎస్​కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

కాంగ్రెస్​ ప్రభుత్వు అమలు చేస్తున్న పథకాలను ప్రతి గ్రామంలో చర్చ పెట్టి ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య,  పీఏసీఏస్​ చైర్మన్​ నడిపెల్లి విజ్జన్​రావు, పత్తి ప్రభాకర్, నాయకులు మ్యాకల భిక్షపతి, జంగటి సుధాకర్​, బొజ్జం రవి, పొనుగోటి వీరబ్రహ్మం, పున్నం రవి తదితరులు పాల్గొన్నారు.