టేకుమట్ల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

టేకుమట్ల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

మొగుళ్లపల్లి( టేకుమట్ల) , వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదివారం పర్యటించారు. మండలంలోని వెలిశాలలో ఆ గ్రామ మజీద్ ఈ- తవక్కల్ కమిటీ విజిట్ అవర్ మసీద్ ప్రోగ్రాం నిర్వహించగా, ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐక్యత, శాంతి, సామరస్యం, సోదరభావం పెరగడానికి ఇలాంటి ప్రోగ్రాములు దోహదపడుతాయన్నారు.

 కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ కోటగిరి సతీశ్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు సంగి రవి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఆమ్జాద్ పాషా, లీడర్లు తదితరులు పాల్గొన్నారు.