కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అద్భుత సిటీగా తీర్చిదిద్దాం : ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అద్భుత సిటీగా తీర్చిదిద్దాం : ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్ టౌన్, వెలుగు : పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనలో రూ.వందల  కోట్లు తీసుకొచ్చి కరీంనగర్ సిటీని  అద్భుతంగా తీర్చిదిద్దామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల  కమలాకర్ అన్నారు. సోమవారం 32వ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.45లక్షలతో చేపట్టనున్న  సీసీ రోడ్డు, డ్రైనేజీ  నిర్మాణ పనులను మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ సిటీ  ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతాప్రమాణాలతో వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

బల్దియాపై ఆర్థికభారం పడకుండా గత  ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు మంజూరు చేసేదని గుర్తు చేశారు. గతంలో కేటాయించిన రూ.85 కోట్ల సీఎం హామీ నిధుల పనులను  ఇప్పటివరకు ప్రారంభించలేదని ఆరోపించారు. మానేరు రివర్ ఫ్రంట్ ను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో  కార్పొరేటర్లు భావన, కచ్చు రవి, ఐలేందర్ యాదవ్, రాములు, మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీనివాస్, శ్రీకాంత్, లీడర్లు సంపత్ రెడ్డి, మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.