- ఆయన వెంట కరీంనగర్ మేయర్, 29 మంది కార్పొరేటర్లు, బీఆర్ఎస్ లీడర్లు
కరీంనగర్, వెలుగు : మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదివారం సాయంత్రం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలిశారు. ఆయన వెంట కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, 29 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు. గంగుల కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం నేపథ్యంలో తన టీమ్‌తో కలిసి కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా పేరున్న గంగుల బీఆర్‌ఎస్‌ను వీడితే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉండడంతో కేసీఆరే గంగులతో పాటు కరీంనగర్ లీడర్లను ఫామ్‌హౌజ్‌కు పిలిపించుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. తాము బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతామని, పార్టీని వీడబోమని ఎమ్మెల్యే గంగుల, మేయర్ సునీల్‌రావు, కార్పొరేటర్లు కేసీఆర్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం. సుమారు గంటపాటు వీరి సమావేశం జరుగగా భవిష్యత్ అంతా బీఆర్‌ఎస్‌దేనని, ఎవరూ పార్టీని వీడొద్దని
కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.