కరీంనగర్ టౌన్, వెలుగు: ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ కు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. ఆదివారం స్థానిక 9వ డివిజన్‌లో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ ను గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తాడని వెల్లడించారు.
వినోద్ కుమార్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతుకనవుతానన్నారు. సంజయ్ ఎంపీగా ఒక్క గుడికి, బడికి నిధులు తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాడని ఆరోపించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, నాయకులు గంధె మహేశ్, ప్రభావతి, కలర్ సత్తన్న, తదితరులు పాల్గొన్నారు.