
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సిటీని టూరిజం హబ్ గా మార్చుకుందామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం సిటీలోని మల్టీపర్పస్ పార్కులో ఫౌంటేన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటీ మెయిన్ సెంటర్ లో నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు స్మార్ట్ సిటీలో భాగంగా జ్యోతిభాపూలే పార్కును, మల్టీపర్పస్ పార్కును నిర్మించామని, పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు క్యాంపు ఆఫీస్ లో 136 మంది లబ్ధిదారులకు రూ.33,29,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్, రాములు, కొత్తపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి మండలం బావుపేటకు చెందిన జీకే యూత్ మండల శాఖ అధ్యక్షుడు వొల్లాల నాగరాజుగౌడ్ సోదరుడు చందుగౌడ్ ఇటీవల చనిపోయాడు. విషయం తెలుసుకున్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంగళవారం వారింటికి వెళ్లి చందు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.