ఎల్‌‌ఎండీకి 2 టీఎంసీలు విడుదల చేయండి : గంగుల కమలాకర్

కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్  సిటీతో పాటు మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని  ఎమ్మెల్యే  గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావుతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎల్‌‌ఎండీని సందర్శించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం  ఎల్ఎండీకి మరో 2 టీఎంసీలు విడుదల చేసి తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు.  బీఆర్ఎస్ హయాంలో  కాళేశ్వరం జలాలతో ఎల్ఎండీ, మిడ్‌‌మానేరు డ్యాంలు నిండుకుండల్లా ఉండేవని గుర్తుచేశారు. అంతకుముందు డ్యాం కట్టపై వాకర్స్‌‌తో వాకింగ్​చేశారు. వినోద్‌‌కుమార్‌‌‌‌ను ఎంపీగా గెలిపించాలని కోరారు.