నరేందర్ కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే గంగుల పరామర్శ

నరేందర్ కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే గంగుల పరామర్శ

కరీంనగర్ టౌన్, వెలుగు: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్ నరేందర్ కుటుంబసభ్యులను మేయర్ సునీల్ రావుతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదివారం పరామర్శించారు. నరేందర్ మృతి పార్టీకి  తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం తన  చిన్ననాటి మిత్రుడు శ్రీనివాస్ తల్లి రత్నాబాయ్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా, ఆయనను ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు పాల్గొన్నారు.