![కొండపైకి వాహనాలకు అనుమతి లేదు](https://static.v6velugu.com/uploads/2022/04/MLA-Gongidi-Sunitha-Reaction-On-Stopping-Vehicles-At-Yadadri_9o8kw46LEa.jpg)
యాదాద్రి భువనగిరి జిల్లా : యాదగిరిగుట్టపైకి వాహనాలను అనుమతించకపోవడంపై ఎమ్మెల్యే గొంగిడి సునీత స్పందించారు. మంగళవారం భువనగిరిలో మీడియాతో మట్లాడిన ఆమె... జర్నలిస్టుల వాహనాలకు స్పెషల్ పార్కింగ్ ప్లేస్, మీడియా పాయింట్ ఏర్పాటు అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. దేవాలయం కొత్తగా నిర్మాణం కావడంతో భక్తులు భారీగా వస్తున్నారని .. ఇబ్బందులు కాకూడదని ఈవో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ కారణంగానే కొన్ని రోజుల వరకు ప్రైవేట్ వాహనాల ఎంట్రీని నిషేధించినట్లు చెప్పారు. భక్తులందరూ సమస్యను అర్ధం చేసుకోని సహకరించాలని కోరారు.
ఇవి కూడా చదవండి
వెడ్డింగ్ షూట్.. నదిలో కొట్టుకుపోయిన కొత్త జంట
22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం బ్యాన్
వెడ్డింగ్ షూట్.. నదిలో కొట్టుకుపోయిన కొత్త జంట
మా పిల్లలను డ్రగ్స్ టెస్ట్ కు తీసుకొస్తా..