- మైనింగ్ తవ్వకాల కేసులో హాజరు
బషీర్ బాగ్,- వెలుగు: మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ నమోదైన కేసులో పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉదయం దర్యాప్తు కోసం వచ్చిన ఎమ్మెల్యే మహిపాల్.. మధ్యాహ్నం వెళ్లిపోయారు. తన స్టేట్మెంట్ ను రికార్డు చేశారని, మళ్లీ పిలిస్తే హాజరవుతానని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఆయన వెళ్లిన తర్వాత ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఆయన స్టేట్మెంట్ ను కూడా ఈడీ అధికారులు రికార్డు చేశారు. అలాగే మహిపాల్ తమ్ముడు మధుసూదన్ రెడ్డి పైనా మైనింగ్ కేసు నమోదు అయింది. కానీ, అనారోగ్యం కారణంగా మధుసూదన్ రెడ్డి హాజరు కాలేదు. మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి ఎమ్మెల్యే మహిపాల్, ఆయన తమ్ముడు మధుసూదన్ పన్ను ఎగ్గొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి