
రామచంద్రాపురం/పటాన్చెరు,వెలుగు: బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ముత్తంగి, ఐనోలు, ఇస్నాపూర్ గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామం అద్భుత ప్రగతి సాధిస్తుందన్నారు. 10 సంవత్సరాల కాలంలో 65 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించారని పేర్కొన్నారు.
ప్రజలు అభివృద్ధిని గుర్తించి కేసిఆర్‌ను మూడోసారి సీఎం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం122 తెలంగాణ క్రీడా ప్రాంగణానాలకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి జీఎంఆర్ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, సర్పంచులు ఉపేందర్, పద్మ వెంకటేశ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు పాండు, నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పంచాయతీరాజ్ డీ ఈ సురేశ్, ఎంపీడీవో బన్సీలాల్ పాల్గొన్నారు.