బొల్లారం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతా : గూడెం మహిపాల్​రెడ్డి

బొల్లారం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతా : గూడెం మహిపాల్​రెడ్డి

జిన్నారం, వెలుగు : బొల్లారం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన  మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో రూ.46  కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ. 26 కోట్ల 50 లక్షలతో నిర్మించిన తాగునీటి సరఫరా వ్యవస్థను, పంప్ హౌస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 

బొల్లారం గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పడిన అనంతరం పాలకమండలితో కలిసి ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ రోజా,  వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మంగతాయారు, సీనియర్ నాయకుడు హనుమంత్ రెడ్డి, జీఎం సుబ్బారాయుడు, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు

అభివృద్ధి పనుల శంకుస్థాపనకు హాజరైన ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డిని కాంగ్రెస్​నాయకులు అడ్డుకున్నారు. మంత్రి దామోదర ప్రారంభించాల్సిన రోడ్డు పనులను మీరెలా ప్రారంభిస్తారని  ప్రశ్నించారు. అభివృద్ధి పనుల శిలాఫలకంలో ఉన్న పేర్లపై  కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ కొంత మంది కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. దీంతో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే డౌన్ డౌన్,గో బ్యాక్  అంటూ నినాదాలు చేశారు.