- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జిన్నారం, వెలుగు: గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు, అండూరు, రాళ్లకత్వ, సొలక్పల్లి, ఊట్ల, వావిలాల, జంగంపేట, జిన్నారం, కొర్లకుంట, కొడకంచి, అలీ నగర్ తదితర గ్రామాల్లో రూ. 3 కోట్ల 90 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో అరుణ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, నరేశ్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.