జుక్కల్​ అభివృద్ధే లక్ష్యం : హన్మంత్​ షిండే

పిట్లం, వెలుగు: జుక్కల్ ​నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే హన్మంత్​షిండే పేర్కొన్నారు. సోమవారం పెద్దకొడప్​గల్​లో సెంట్రల్ ​లైటింగ్ పనులను, మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ఆశీర్వాదంతో జుక్కల్​నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా విద్యా, వైద్యం, రహదారులు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్​రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


మద్నూర్: ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్​తెలంగాణలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పేర్కొన్నారు. సోమవారం మద్నూర్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడు లేని విధంగా నిధులు మంజూరు చేసి, అభివృద్ధి పనులు చేశామన్నారు. కేసీఆర్​నాయకత్వం మూడోసారి అధికారంలో వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మద్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ లో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు.  కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శశాంక్ పటేల్, బన్సీ పటేల్, దరాస్ సురేశ్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు.