మైనంపల్లి అనుచరులు వర్సెస్ బీజేవైఎం కార్యకర్తలు పొట్టు పొట్టు కొట్టుకున్నరు

హైదరాబాద్  అల్వాల్లో ..మల్కాజ్ గిరి ఎమ్మెల్యే హనుమంతరావు అనుచరులు.. బీజేవైఎం నాయకులు కొట్టుకున్నారు.  అల్వాల్లోని రాక్ ల్యాండ్ అవెన్యూలో  మైనంపల్లి హనుమంతరావు అనుచరులు భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలు రావడంతో..బాధితుల పక్షాల బీజేవైఎం నాయకులు  నిలబడ్డారు.  రాక్ ల్యాండ్ అవెన్యూ కార్యాలయాన్ని బీజేవైఎం నాయకులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మైనంపల్లి హనుమంతరావు అనుచరులు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

రాక్ ల్యాండ్ అవెన్యూలో మైనంపల్లి అనుచరులు కబ్జా చేశారని ఆరోపణల నేపథ్యంలో బాధితులు బీజేవైఎం నాయకులను ఆశ్రయించారు. దీంతో పెద్ద సంఖ్యలో బీజేవైఎం నాయకులు అల్వాల్ లోని రాక్ ల్యాండ్ అవెన్యూకు చేరుకుని..కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం కారణంగానే తాము రంగంలోకి దిగినట్లు  బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయిప్రసాద్ వెల్లడించారు. అయితే రాక్ ల్యాండ్ అవెన్యూ  కార్యాలయ అద్దాలు ధ్వంసం చేస్తున్న క్రమంలో అక్కడకు  మైనంపల్లి అనుచరులు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని గొడవకు దారి తీసింది. 

బీజేవైఎం నాయకులపై మైనంపల్లి హనుమంతరావు అనుచరులు దాడి చేశారు. రాళ్లు, కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. బీజేవైఎం నాయకులను మైనంపల్లి అనుచరులు పరిగెత్తించుకుంటూ కొట్టారు. మైనంపల్లి హనుమంతరావు అనుచరుల దాడిలో బీజేవైఎం నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. మైనం పల్లి అనుచరులకు, బీజేవైఎం నాయకులకు జరిగిన  ఘర్షణలో అల్వాల్ పోలీసులు మైనంపల్లి వర్గానికి మద్దతుగా నిలిచారని బీజేవైఎం నాయకులు ఆరోపించారు.