- సిద్దిపేట న్యాయవాది రవీందర్ యాదవ్ ఆరోపణ
ఖైరతాబాద్, వెలుగు: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక్సాగర్వద్ద భూ ఆక్రమణకు పాల్పడ్డారని, అందుకు తగిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని సిద్దిపేటకు చెందిన న్యాయవాది జెల్ల రవీందర్యాదవ్ఆరోపించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.
రంగనాయక సాగర్‌ప్రాజెక్టు కోసం ఇరిగేషన్‌శాఖ సేకరించిన భూమిలో 9 గుంటలను హరీశ్‌రావు ఆక్రమించారన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ సర్వే నంబర్402లో 13 ఎకరాల 3 గుంటల్లో 9 గుంటల భూమి నీటిపారుదల శాఖకు చెందినదన్నారు. తన రాజకీయ జీవితంలో ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదని పదే పదే చెబుతున్న హరీశ్‌రావు.. దీనిపై స్పందించి నిజాయతీని నిరూపించుకోవాలన్నారు. సిద్దిపేటలో ఇప్పటికీ హరీశ్రాజ్యమే నడుస్తున్నదన్నారు. రవీందర్‌తో అశోక్, రమేశ్ ఉన్నారు.