ఇల్లెందు, వెలుగు: సుభాష్ నగర్ గ్రామ పంచాయతీలో అటవీశాఖ ఆధ్వర్యంలో డెవలప్చేసిన ఇల్లెందు నేచర్ పార్కును ఎమ్మెల్యే హరిప్రియనాయక్శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 270 ఎకరాల్లో రూ.1.76కోట్లతో చుట్టూ ఫెన్సింగ్, లైటింగ్, హతట్స్, నాలుగు కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్ నిర్మించామని చెప్పారు.
పట్టణ, పల్లె ప్రగతి ద్వారా ఇల్లెందు నియోజకవర్గంలో 56 పార్కులను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సీసీఎఫ్ భీమా నాయక్, డీఎఫ్ఓ కృష్ణగౌడ్, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, ఎఫ్ డీఓ కర్ణావత్ వెంకన్న, సర్పంచ్ వల్లాల మంగమ్మ, ఎంపీటీసీ శీలం ఉమ, ఇల్లెందు రేంజర్ భూక్యా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.