తెలంగాణలో లో శాంతి భద్రతలు క్షీణించినయ్ : హరీశ్​ రావు

తెలంగాణలో లో శాంతి భద్రతలు క్షీణించినయ్ : హరీశ్​ రావు
  • వరుస హింసాత్మక ఘటనలే నిదర్శనం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​ రావు ఆరోపించారు. వరుస హత్యలు, అత్యాచారాలు, హింసాత్మక ఘటనలే ఇందుకు నిదర్శనమని బుధవారం ఆయన ట్వీట్​ చేశారు. ‘‘గడిచిన వారం రోజుల్లోనే ఎన్నో ఘటనలు జరిగాయి. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగానే సంజీవ్​ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు. 

హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్ లో సమీర్​ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేండ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య  ఘటన మరచిపోక ముందే మరో దారుణం చోటుచేసుకున్నది. రక్షించాల్సిన పోలీసే తోటి మహిళా కానిస్టేబుల్​పై అత్యాచార ఘటన భూపాలపల్లి జిల్లాలో జరగడం అత్యంత హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో.. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే భద్రత ప్రశ్నార్థకమవడం బాధాకరం”అని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.