
సిద్దిపేట, వెలుగు: నాలుగు వేల పెన్షన్, తులం బంగారం, మహాలక్ష్మి పథకం వంటి ఆశలు చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం క్యాంపు ఆఫీసులో బాధితులకు సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. సిద్దిపేటకు సీఎం అన్యాయం చేస్తున్నారని వెటర్నరీ కాలేజ్ ను కొడంగల్ కు తరలించక పోవడమే కాకుండా, నర్సింగ్ కాలేజీ, వెయ్యి పడకల ఆస్పత్రి, రంగనాయక సాగర్ టూరిజం, శిల్పా రామం, పీఎస్పనులు ఆపారని ఆరోపించారు. అసెంబ్లీలో సిద్దిపేట, మెదక్ జిల్లా కు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పుతానన్నారు. అనంతరం చిన్నకోడూరు మండలంలో పర్యటించి బెల్లంకుంటకు వెళ్లే కాలువ వద్ద నీళ్లు వదలారు.అనంతరం మండలంలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు.