![రైతుభరోసాపై కాంగ్రెస్ మోసం .. ఎకరంలోపు రైతులకే ఇచ్చారు: హరీశ్ రావు](https://static.v6velugu.com/uploads/2025/02/mla-harish-rao-criticizes-congress-government-for-cheating-farmers-on-farmer-insurance_4VolQA5ezJ.jpg)
హైదరాబాద్, వెలుగు: రైతుభరోసా విష యంలో రైతులను కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రైతులందరికీ రూ.7,500 రైతుభరోసా అని చెప్పి.. దాన్ని రూ.6 వేలకు కుదించారని గుర్తుచేశారు. ఇప్పుడు అది కూడా కేవలం ఎకరంలోపున్న రైతులకే అమలు చేశారని తెలిపారు. కానీ, రైతుభరోసాను ఇచ్చి మాట మీద నిలబడినట్టు ప్రచా రం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 68 లక్షల మంది రైతులుంటే.. కేవలం 21,45,330 మందికే రైతు భరోసా వేశారని వెల్లడించారు.
మరి మిగతా 47 లక్షల మం ది రైతుల పరిస్థితి ఏంటని బుధవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి లబ్ధిదారుల్లో కోతలు విధించడంపై ఉన్న దృష్టి రైతులు, పేదల సంక్షేమం పట్ల ఏమాత్రం లేదని హరీశ్ రావు విమర్శించా రు. 14 నెలల పాలనలో 415కిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమని హరీశ్ రావు అన్నారు.