
- రైతులను నట్టేట ముంచింది: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: యూరియా కోసం రైతులు మండుటెండల్లో తంటాలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. మొన్న మహబూబాబాద్‌లో యూరియా కోసం పోలీసులు టోకెన్లు ఇస్తే.. ఇప్పుడు జగిత్యాలలో రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులను క్యూలో పెట్టాల్సిన పరిస్థితి దాపురించిందని సోమవారం ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు.
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు పడిన కన్నీళ్ల కడగండ్లను.. ఇప్పుడు తెలంగాణలోనూ కాంగ్రెస్ సర్కారు పునరావృతం చేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రైతే రాజుగా ఉన్న తెలంగాణలో.. రేవంత్ సర్కారు నట్టేట ముంచి నడిరోడ్డుపైకి తెచ్చిందన్నారు. యూరియా సరఫరాలో సర్కారు విఫలమైందని ఫైర్ అయ్యారు.