![చెల్కలపల్లిని ముంపు గ్రామంగా గుర్తించాలి..ఇరిగేషన్ మంత్రికి ఎమ్మెల్యే హరీశ్ రావు లెటర్ ](https://static.v6velugu.com/uploads/2025/02/mla-harish-rao-seeks-flooded-village-status-for-challapalli_twgnseoj9P.jpg)
సిద్దిపేట రూరల్, వెలుగు: చిన్న కోడూరు మండలం చెల్కలపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా గుర్తించాలని, వారికి ప్రత్యేక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్యాకేజీ ఇవ్వాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్ రావు గురువారం లెటర్ రాశారు. చెల్కలపల్లి గ్రామ పరిధిలో కాళేశ్వరంలో భాగంగా అన్నపూర్ణ (అంతగిరి) రిజర్వాయర్ నిర్మించామన్నారు. నిర్మాణంలో భాగంగా పక్కనే ఉన్న కోచ్చగుట్టపల్లి గ్రామంలో 104 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించి ప్యాకేజీతోపాటు ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణం చేపట్టామన్నారు.
అయితే దీనికి 50 మీటర్ల దూరంలో చెల్కలపల్లి గ్రామం కూడా ఉంటుందని, ఈ గ్రామంలో అప్పటి ఎఫ్ఆర్ఎల్ లో రెండు ఇండ్లు, నాలుగు కుటుంబాలు మాత్రమే ముంపునకు గురికావడంతో ప్యాకేజీ ఇచ్చామన్నారు. ప్రస్తుతం అదనపు టీఎంసీ పంప్ హౌస్ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్, డంప్ యార్డ్, గ్రామం మూడువైపులా అన్నపూర్ణ రిజర్వాయర్ నీళ్లు ఇండ్లలోకి చేరుతున్నాయని, ఇప్పటికైనా గ్రామాన్ని ముంపు గ్రామాన్ని ప్రకటించి ప్యాకేజీ ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు. 17 రోజులుగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పది విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ బుక్స్...
స్కూళ్లలో టీచర్లు చెప్పిన పాఠాలను సులువుగా రివిజన్ చేసుకునేలా ఎమ్మెల్యే హరీశ్ సొంత ఖర్చుతో నియోజకవర్గంలో 2500 మంది విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ బుక్స్ ను తయారు చేయించారు. వాటిని గురువారం స్టూడెంట్ల ఇండ్లకు చేర్చారు.