ఇందిరమ్మ రాజ్యం కాదు.. పోలీస్ రాజ్యం: ఎమ్మెల్యే హరీశ్రావు ట్వీట్

ఇందిరమ్మ రాజ్యం కాదు.. పోలీస్ రాజ్యం: ఎమ్మెల్యే హరీశ్రావు ట్వీట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాదు.. పోలీస్ రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు ‘ఎక్స్’ లో ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని తెలిపారు. ఈ విషయం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యాఖ్యల ద్వారా స్పష్టమ వుతున్నదని చెప్పారు.

‘‘ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్నికల కమిషన్ ఎందుకు ఈ విషయంపై నోరు మెదపడం లేదు? సుమోటోగా తీసుకొని కేసులు ఎందుకు పెట్టడం లేదు? కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా? రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఏ విధంగా సమర్థిస్తారు? ఏం సమాధానం చెబుతారు? బడే భాయ్, ఛోటే భాయ్ బంధానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? బీజేపీ, కాంగ్రెస్​ల చీకటి ఒప్పందానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?” అని ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు.