రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్

రాష్ట్రంలో పరిపాలించటం చేతకాక ఇతర రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ తిరుగుతున్నారని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎవరూ పట్టించుకోకున్నా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద కేసీఆర్ పడిగాపులు కాస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వద్ద అపాయింట్ మెంట్ కోసం సీఎం కేసీఆర్ వేచి చూడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పట్టించుకోకుండా.. పక్క రాష్ట్రాల్లోని రైతు కుటుంబాలకు చెక్కులు పంచడం సీఎం కేసీఆర్ కు తగదన్నారు. 

2018లో కేంద్రంలో చక్రం తిప్పుతానని వెళ్లిన సీఎం కేసీఆర్ బొక్కబోర్లా పడ్డారంటూ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వలేని అప్పులకుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. చట్టాలను మార్చి, అప్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న సీఎం కేసీఆర్ ను కాగ్ తప్పు పడుతుందని చెప్పారు. ఇష్టారీతిన అన్నింటిపైనా చార్జీలు పెంచి, పేద, సామాన్య, మధ్య తరగతి వారిపై అధిక భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని ముందుకు తీసుకువెళ్లడంలో ముందుంటానని చెప్పారు. 

 

మరిన్ని వార్తల కోసం..

సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కన్నుమూత

పార్లమెంటులో బీజేపీ తరపున ఒక్క ముస్లిం ఎంపీ కూడా ఉండరు..!