- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు : అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే రామన్నపేట మండలం కకావికలం అవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. రామన్నపేటలో ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు అభిప్రాయం చెప్పారని తెలిపారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ను అరెస్టు చేయడం సరికాదని చెప్పారు. అదానీ ఆధ్వర్యంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని చూస్తున్నారని, రామన్నపేట మండలంలోని మూగజీవాలకు గడ్డి దొరకదని, మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు.