నకిరేకల్, వెలుగు: నకిరేకల్ మండలం పాలెం గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామికి వారికి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి దంపతులు ముడుపు చెల్లించుకున్నారు. ఎన్నికల నామినేషన్ కు ముందు లక్ష్మీ నరసింహ ముడుపు కట్టిన వారు తమ కోరిక తీరడంతో సోమవారం ఆలయానికి వెల్లి పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యే దంపతులను సన్మానించి ఆశీర్వచనాలు అందజేశారు.
లక్ష్యం సాధించాలే వరకు విశ్రమించొద్దు
సూర్యాపేట, వెలుగు: అనుకున్న లక్ష్యం చేరుకునే విశ్రమించొద్దని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సూచించారు. సోమవారం తెలంగాణ అకాడమీ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్‌లో 500 మందికి టెక్ విజన్ , షాఫ్ట్ సాప్ట్ వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఇస్తున్న శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా టాస్క్ లో శిక్షణ పొంది కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన యువతులను అభినందించారు. అనంతరం సీజీఐ సంస్థ స్పాన్సర్ చేసి ల్యాప్‌టాప్‌లను టాస్క్ సంస్థ కు అందజేశారు.