- చర్యలు తీస్కోకుంటే కోర్టుకెళ్తం
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌కుమార్‌లపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు స్పీకర్‌ను అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదని, అందుకే.. స్పీడ్ పోస్టు, ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు లేఖను పంపించామన్నారు.
.వారిపై స్పీకర్ చర్యలు తీసుకోకుంటే న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపులను నిరోధించేలా చట్టాన్ని తెస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు పార్టీ ఫిరాంయిపులను ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు. ఇలాంటి సిగ్గుమాలిన పనులు చెయ్యొద్దని ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డే చెప్తున్నారని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.