- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర సర్కారు ఫెయిల్ అయిందని, పాలించే నైతిక హక్కును కోల్పోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, గట్టు రాంచందర్ రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో 20 జిల్లాల్లో వర్షం ప్రభావం ఉందని, అయినా ప్రభుత్వం సోయిలేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. బాధితులు ప్రభుత్వ సాయం కోసం గంటల తరబడి ఎదురుచూశారన్నారు.