
కొండాపూర్, వెలుగు: ఈ నెల 29న సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారన్నారు. ప్రతి మండలం నుంచి జన సమీకరణ చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు సూచించారు.
కాంగ్రెస్ సంక్షేమ పథకాలను గడపగడపకు ప్రచారం చేసే బాధ్యత కార్యకర్తలదేనన్నారు. సమావేశంలో సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్, కంది మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, సంగారెడ్డి, సదాశివపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.