రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుంది

రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుంది

వరి సాగుపై బీజేపీ, టిఆర్ఎస్ ప్రభుత్వాల డ్రామాలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాడుతుందని, నవంబర్1 తర్వాత చలో సిద్దిపేట చేపడతామని తెలిపారు. వరి కొనకపోతే మంత్రులను అడ్డుకుంటామన్నారు. కాంగ్రెస్ నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తామన్నారు. మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. లేదంటే నడిరోడ్డు మీద బట్టలు విప్పిస్తామన్నారు.

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి..రైతులను నేరుగా బెదిరించేలా మాట్లాడారన్నారు. తెలంగాణ లో 65లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని అన్నారు. మనం అన్నం తినే వాళ్ళం.. రొట్టెలు తినలేమన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ అండగా వుంటుందన్నారు. ఉద్యమానికి కాంగ్రెస్ నేతలు సిద్ధం కావాలన్నారు.

మంత్రి జగదీష్ గింజ కూడా కొనమని రైతులకు వార్నింగ్ ఇస్తున్నాడని..ఎట్లా కొనడో చూస్తామన్నారు జగ్గారెడ్డి. హరీశ్ రావు అంటేనే అబద్దం..ఎన్నికల ప్రచారం కోసమే ప్రతి గింజా కొంటామని ప్రచారం చేస్తున్నాడని అన్నారు.