మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. టెట్,ఆర్ఆర్బీ, ఎగ్జామ్స్ ఒకే రోజు ఉండడంతో,టెట్ పరిక్ష తేదీని మార్చాలని ఆయన శుక్రవారం మంత్రి ఇంటి ముందు ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు రోజుల క్రితం ప్రజల సమస్యలు చెప్పేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి సబితారెడ్డిని అప్పాయింట్ మెంట్ అడిగాము..కానీ వారు ఇవ్వడం లేదు. ఇక్కడ సరికొత్త పాలన నడుస్తుందని ధ్వజమెత్తారు.టెట్ నోటిఫికేషన్ నెల రోజుల క్రితం వచ్చింది.. ఆర్ఆర్ బీ ఏడాది క్రితం నోటిఫికేషన్ వచ్చింది. ఈ రెండు పరీక్షలు రాసే వాళ్ళు అభ్యర్దులు మూడు లక్షల మంది ఉన్నారు. అయితే ఒకే రోజు ఈ రెండు పరీక్ష ఉండడంతో ఆర్ఆర్ బీ రెండో పరీక్షకు అభ్యర్ధులు హాజరు కాలేకపోతున్నారని.. ఆర్ఆర్ బీ రోజే టెట్ పెడితే ఎలా జగ్గారెడ్డి ప్రశ్నించారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మండిపడ్డారు. సబితా ఇంద్రారెడ్డి..కాంగ్రెస్ హయాంలో బాధ్యతాయుతంగా పనిచేశారు. కానీ టీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యాక ఇలా నిర్లక్ష్యంగా తయారు అయ్యారని జగ్గారెడ్డి విమర్శించారు. కేంద్రం ఏడాది క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ను మార్చుకోమని చెప్పండి అంటున్నారు సబితారెడ్డి.. ఇంత అవగాహన రహితంగా ఎలా మారిపోయారన్నారు.. అవగాహన లేని మంత్రిగా సబితారెడ్డి మారిపోయారని జగ్గారెడ్డి ఎద్దేవ చేశారు. టెట్ తేదీ మార్చడానికి ఇబ్బంది ఏంటి అని ఆయన ప్రశ్నించారు.ఒకటి రెండు రోజుల్లో పరిక్ష తేదీని మారుస్తూ ప్రకటన చేయాలని.. లేకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ విషయమై మంత్రికి ఫోన్ చేస్తే.. కనీసం ఫోన్ ఎత్తడం లేదన్నారు ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డి మనసు మర్చుకొని టెట్ పరిక్ష వాయిదా వేయాలని కోరారు జగ్గారెడ్డి. సబితా ఇంద్రారెడ్డి వచ్చే వరకు ఇంటి ముందు ధర్నా చేస్తామని ఆయన ప్రకటించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు ఎన్ఎస్ యూఐ కార్యకర్తలుతో కలిసి ధర్నాకు కూర్చున్నారు జగ్గారెడ్డి.
విద్యాశాఖ మంత్రి @SabithaindraTRS ఇంటి ముందు శాంతియుత నిరసన తెలపుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు మరియు NSUI రాష్ట్ర అధ్యక్షులు @VenkatBalmoor గారు,NSUI బృందం. pic.twitter.com/OjdTreRc0K
— NSUI TELANGANA (@TSNSUI) June 3, 2022