కాంగ్రెస్ పార్టీనా.. లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇదీ కాంగ్రెస్ పార్టీనా.. లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా అని అన్నారు. అసెంబ్లీ హాల్లో కాంగ్రెస్ LP సమావేశంలోలో పార్టీ ఎమ్మెల్యేలు, CLP నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అయితే CLP సమావేశంలో పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ నేతల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రచారం కోసం ఆరాటపడితే కాంగ్రెస్ పార్టీలో కుదరదన్నారు. జహీరాబాద్ వస్తే కనీసం గీతారెడ్డికి సమాచారం ఇవ్వలేదన్నారు జగ్గారెడ్డి.జహీరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ విషయంపై కనీసం గీతారెడ్డికి సమాచారం ఇవ్వరా..? అని ప్రశ్నించారు.  చర్చ లేకుండానే రెండు నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాకి వస్తే... వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తనకే సమాచారం ఇవ్వారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో ఏ ఒక్కరు హీరో కారన్నారు.