ఇంత బతుకు బతికి పార్టీలో ఇలాంటి పరిస్థితి చూస్తాననుకోలె: జగ్గారెడ్డి

ఇంత బతుకు బతికి పార్టీలో ఇలాంటి పరిస్థితి చూస్తాననుకోలె: జగ్గారెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.  పార్టీ నేతలపై తప్పుడు ప్రచారం చేయించే దరిద్రం దాపురించిందన్నారు. నాలుగేళ్లుగా పార్టీలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. పార్టీ కోసం ఎంతో చేసిన  తనను  ప్రశ్నిస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు.  ఇంత బతుకు బతికి పార్టీలో ఇలాంటి పరిస్థితి చూస్తాననుకోలేదన్నారు. ఉత్తమ్  ఆవేదన  వెనుక బలమైన కారణం ఉందన్నారు జగ్గారెడ్డి.

ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు రాహుల్ పిలిస్తే ఢిల్లీకి వచ్చానని చెప్పారు జగ్గారెడ్డి.  పార్టీ ఐక్యంగా ఉందో లేదో  రాహుల్ గాంధీకి వివరిస్తానని చెప్పారు.  క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెబుతానన్నారు.  ఎన్నికలంటే రూ. 20 కోట్లు, రూ. 30 కోట్లు అనే పరిస్థితి వచ్చిందన్నారు. 

ALSO READ:తిరుపతి కురుమూర్తి టెంపుల్​ హుండీ లెక్కింపు

ఏఐసీసీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జూన్ 27న మధ్యాహ్నం జరగనుంది.  ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.   రాష్ట్ర ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే తో పాటు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కి గౌడ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క,జీవన్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర్ రాజనర్సింహా పాల్గొననున్నారు.