ఎమ్మెల్యే జైవీర్​గన్‎మెన్లకు తృటిలో తప్పిన ప్రమాదం

  ఎమ్మెల్యే జైవీర్​గన్‎మెన్లకు తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్: నాగార్జునసాగర్​ఎమ్మెల్యే కుందూరు జైవీర్​రెడ్డి కాన్వాయ్​లో ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‎లోని స్కార్పియో వాహనం కంట్రోల్​తప్పి బోల్తా  కొట్టింది.  కారులో ప్రయాణిస్తున్న గన్​మెన్లకు ప్రమాదం తప్పింది.  గుర్రంపోడు మండలం చేపూర్​గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది.  ఎలాంటి ప్రాణనష్టం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎమ్మెల్యే  జైవీర్​రెడ్డి  ఇవాళ గుర్రంపోడు ఆలయ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.