అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్​లో చెత్తను క్లీన్​ చేసిన ఎమ్మెల్యే

అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్​లో చెత్తను క్లీన్​ చేసిన ఎమ్మెల్యే

అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్ లో శుక్రవారం ‘స్వచ్ఛ ఆర్టీసీ’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. ప్రాంగణంలో ఉన్న చెత్తను చీపుర్లు తీసుకొని స్వయంగా ఆయనే కాంగ్రెస్ నాయకులతో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అందిరికీ ఉపయోగపడే ఆర్టీసీ బస్టాండ్ లాంటి ప్రదేశాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయొద్దని చెప్పారు. 

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ మూర్తి, నాయకులు తుంమ్మా రాంబాబు, చిన్నంశెట్టి సత్యనారాయణ, మిండా హరిబాబు, కొట్టే శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.