సమాజ శ్రేయస్సు కోరేదే జర్నలిజం : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

సమాజ శ్రేయస్సు కోరేదే జర్నలిజం : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
  • ప్రెస్ క్లబ్ ఏడవ మహాసభలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ 

అశ్వారావుపేట, వెలుగు: సమాజ శ్రేయస్సు కోరేదే జర్నలిజమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. మంగళవారం అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ అసోసియేషన్ 7 వ మహాసభ భద్రాచలం రోడ్డు లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చ నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

నూతనంగా ఎన్నికైన క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు తిరుమల శెట్టి అప్పారావు, వలి పాషా ను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల కంటే భిన్నంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నామన్నారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి  చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జూపల్లి రమేశ్, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, కొక్కెర పార్టీ పుల్లయ్య, తుమ్మ రాంబాబు, చిన్నంశెట్టి సత్యనారాయణ, సలీం, వ్యవసాయ కళాశాల డీన్ హేమంత్ కుమార్, తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.