వరద రాకుండా చర్యలు చేపడతాం: జారే ఆదినారాయణ

వరద రాకుండా చర్యలు చేపడతాం: జారే ఆదినారాయణ

చండ్రుగొండ, వెలుగు:  డబుల్ బెడ్ రూమ్​ ఇండ్ల ను వరద ముంచెత్తకుండా చర్యలు తీసుకుంటానని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. సోమవారం చండ్రుగొండ లోని డబుల్ బెడ్ రూమ్​ ఇండ్ల ను పరిశీలించారు.

 ఇండ్ల చుట్టూ ఉన్న ప్రహరీ గోడ ఎత్తు పెంచి, కాలనీ లో సీసీ రోడ్లు, బత్ రూమ్​లు, స్లాబ్ కురవకుండా ఫ్లోరింగ్ లాంటి మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని, భోజన సదుపాయం కల్పిస్తానని భారోసానిచ్చారు. ఎమ్మెల్యే వెంట ఎంపీడీవో అశోక్, తహసీల్దారు సంధ్యారాణి, కాంగ్రేస్ లీడర్లు ఉన్నారు. 

వైద్య సిబ్బందిపై ఆగ్రహం

ములకలపల్లి :  మండల కేంద్రంలోని మంగపేట పీహెచ్​సీని ఎమ్మెల్యే జారే సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్​లో రోగులు బారులు తీరారు.. కానీ డాక్టర్లు విధుల్లో లేరు. మందులు కూడా ఇవ్వడం లేదని, బయటనే కొనాలని పేషెంట్లు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీంతో వెంటనే డీఎంహెచ్​వో, కలెక్టర్​కు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఫోన్​ చేసి సమస్యను వివరించారు.

 పీహెచ్​సీ డాక్టర్లు, సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న రిపేర్లను పరిశీలించి ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్​ను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఎంపీడీవో మహాలక్ష్మి, తహసీల్దార్ పుల్లారావులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులంతా అలర్ట్ గా ఉండాలని సూచించారు.