యర్రగుంటలో రైల్వే రోడ్డు ఓవర్​ బ్రిడ్జి ప్రారంభం

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం యర్రగుంటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.93 లక్షలతో నిర్మించిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని సోమవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, రోడ్డు ఓవర్​ బ్రిడ్జిలు, అండర్​ పాస్​లు వర్చువల్​ గా ప్రారంభించి, వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జాతికి అంకితం  చేశారు.  అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు ఓవర్​ బ్రిడ్జి 

ఉపయోగాలు, రైల్వే అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో  భద్రాచలం రోడ్డ్​ రైల్వే ఏరియా ఆఫీసర్ రజినీస్​ మీనా, తహసీల్దార్ జగదీశ్వర్​ప్రసాద్, కొవ్వూరు రైల్వే లైన్​ సాధన కమిటీ కన్వీనర్ ​ పాండురంగాచార్యులు, చీఫ్​ కమర్సియల్​ ఇన్స్​పెక్టర్ జేమ్స్​పాల్, ఆర్​ అండ్​ బీ ఈఈ  వెంకటేశ్వరరావు, డీఈ నాగేశ్వరావు, ఎంపీఓ షబ్నా, నాయకులు పాల్గొన్నారు.​​​​