గ్రామాల అభివృద్ధిలో నిర్లక్ష్యం చేయొద్దు : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

చండ్రుగొండ, వెలుగు : గ్రామాల అభివృద్ధిలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పష్టంచేశారు. మంగళవారం ప్రజాపాలన విజయోత్సవం సందర్భంగా మండలంలోని పలు గ్రామల్లో ఆయన పర్యటించారు.  మద్దుకూరు, దామరచర్ల, అయ్యన్నపాలెం, చండ్రుగొండ, రావికంపాడు, పోకలగూడెం, మంగయ్యబంజరు, దుబ్బతండా, బెండాలపాడు, గుర్రాయిగూడెం గ్రామాలలో సీసీ రోడ్లు ప్రారంభం, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాది పాలనలో  నియోజకవర్గంలో రూ.38 కోట్లు అభివృద్ది పనులకు వెచ్చించినట్లు తెలిపారు. ఐటీడీఏ ద్వారా నియోజకవర్గానికి బీటీ రోడ్ల కోసం రూ.31 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద  నియోజవకర్గానికి రూ.108 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు.  ఈ కార్యక్రమంలో తహసీల్దారు సంధ్యారాణి, కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, భోజ్యానాయక్, సురేశ్, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.