కనిగిరి గుట్టలు టూరిస్టులను ఆకర్షిస్తున్నయ్ : జారే ఆదినారాయణ

కనిగిరి గుట్టలు టూరిస్టులను ఆకర్షిస్తున్నయ్ : జారే ఆదినారాయణ

చండ్రుగొండ, వెలుగు : చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు శివారులో ఉన్న కనిగిరి గుట్టలు టూరిస్టులను  ఆకర్షిస్తున్నాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. బుధవారం ఆయన కనిగిరి గుట్టల సమీపంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కనిగిరి గుట్టలపై ఉన్న  హస్తాల వీరభద్ర స్వామి, కాకతీయులు నిర్మించిన పలు కట్టడాలు, ఆదివాసీలు నిర్వహిస్తున్న బాంబో క్లస్టర్ టూరిజం స్పాట్ లు గా ఉన్నాయన్నారు. 

అనంతరం చండ్రుగొండ లోని కేజీబీవి స్కూల్ ను సందర్శించారు. టెన్త్ లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చదవాలని స్టూడెంట్ల కు సూచించారు. ములకలపల్లి : మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో కొలు వై ఉన్న ఆదివాసి వనదేవతలు సమ్మక్క సారమ్మ మినీ మేడారం జాతర మహోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.