అశ్వారావుపేట, వెలుగు: నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దంపతులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. గెలిచిన తర్వాత మొదటిసారిగా క్యాంప్‌ఆఫీస్‌లో అడుగుపెట్టడం సంతోషకరంగా ఉందన్నారు.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వినాయకాపురం గ్రామాల్లో అనారోగ్యం బారిన పడిన 2 కుంబాలకు ఎల్ఓసీ అందజేశారు. ప్రభుత్వ పథకాలను అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జూపల్లి రమేశ్, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.