కందికొండ గుట్టవద్ద జాతర పనులను  చేపట్టాలి :  ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్

కందికొండ గుట్టవద్ద జాతర పనులను  చేపట్టాలి :  ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్

కురవి, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గుట్టవద్ద జాతర పనులను చేపట్టాలని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయా శాఖల అధికారులతో కలిసి కందికొండ గుట్ట పనులను పరిశీలించారు. ఇటీవల వర్షాలు కురవడంతో దెబ్బతిన్న గుట్టపైకి వెళ్లే దారిని  రిపేర్​ చేయాలన్నారు. జాతరలో ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట తొర్రూర్ డీఎస్పీ కృష్ణకుమార్, మరిపెడ సీఐ రాజకుమార్ గౌడ్, డీఈ జుంకీలాల్, కాంగ్రెస్​మండలాధ్యక్షుడు అంబటి వీరభద్ర గౌడ్, మాజీ జడ్పీటీసీ వెంకటరెడ్డి తదితరులున్నారు.

ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బర్త్​డే..

మాజీ ఎమ్మెల్సీ వి.వెంకట్ రెడ్డి 100వ జన్మదిన వేడుకలను సీరోలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామచంద్రునాయక్ తోపాటు పలువురు నేతలు పాల్గొని కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. 

అభివృద్ధి పనులు వేగంగా చేయాలి 

మరిపెడ: మరిపెడ పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్ సూచించారు. మంగళవారం మరిపెడ పట్టణ కేంద్రంలో వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణ పనులను, మోడల్ మార్కెట్, వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆయనవెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి, తాజుద్దీన్, అధికారులున్నారు.