పాశిగామలో ఉద్రిక్తత..భారీగా మోహరించిన పోలీసులు

జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల డీసీసీ ప్రెసిడెంట్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను  హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.  జీవన్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.  ఇథనాల్  ఫ్యాక్టరీకి వ్యతిరేంగా జగిత్యా ల నుంచి  వెల్గటూరు మండలం పాశిగామ గ్రామస్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న జీవన్ రెడ్డిని పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. పాశిగామలో కూడా  పోలీసులు భారీగా మోహరించి గ్రామస్తులను బయటకు రాకుండా కట్టడి చేశారు.

రాష్ట్రంలో నిరంకుశ, నియంతృత్వ పాలన సాగుతోందని జీవన్ రెడ్డి విమర్శించారు. దొంగచాటుగా ఇథనాల్ పరిశ్రమకు శంకుస్థాపన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇథనాల్ పరిశ్రమతో పరిసరాలు కలుషితం అవుతాయని అన్నారు. నిర్భందాలతో ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు.