ఆదిలాబాద్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 28న ఆదిలాబాద్ పట్టణంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు మంత్రి హరీశ్ రావు హాజరవుతారని కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. డైట్ కాలేజ్ గ్రౌండ్లో సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే గురువారం సాయంత్రం పరిశీలించారు. పార్టీ శ్రేణులకు హరీశ్ రావు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.