బీసీలను మభ్యపెడుతున్నరు : బీజేపీ

  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్

​ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  ఎన్నికలు దగ్గర  పడుతున్నాయని ఎమ్మెల్యే జోగు రామన్న బీసీలకు రూ. లక్ష లోన్లు అని మభ్యపెట్టే  ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​ ఫైర్​ అయ్యారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా గురువారం పట్టణంలోని భూక్తాపూర్ కాలనీలో  ఇంటింటికీ  బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి వేలకోట్ల ఫండ్స్​ వచ్చాయన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను లబ్ధిదారులకు చేరకుండా మధ్యలోనే మింగేసిందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గానికి చేసిందేమిటో చెప్పాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆకుల ప్రవీణ్, జోగురవి, రాజశేఖర్, ధోని జ్యోతి, ముకుంద్ రావు, శివ,  నరేశ్, రాజూ, కృష్ణారెడ్డి, శ్రీకాంత్, కార్యకర్తలు పాల్గొన్నారు.